అలలకు అలుపు లేదు ,
గాలికి అదుపులేదు ,
భూమికి బరువు లేదు,
సూర్యునికి పొదుపు లేదు ,
కలలకు, కళల కు కన్నులతో పని లేదు.
కమల నాథుని కిరణ కలము తో జలజాక్షు ని శిరము నుండి జాలు వారిన
మకరంద సిర తో, ధరణి పలకము ఫై చిత్రించిన సుగంధ వాయులీన విచిత్రము.
ఆకాశం లో కైలాసం
చితాకాశం లో దరహాసం
కలిగించింది వికాసం
ముక్కంటి రాక తో మురిసింది విశాఖం....
ఎంత రక్షించ యత్నించినా వెళ్లి పొయ్యావంటోంది కాడ..
రావాలని యత్నించింది కొమ్మ నీతో కూడా..
నీ సుగంధం కోల్పోయ్యాను అంటోంది మొక్క నీడ..
సీతా కొకకి తెలియలేదు నీ జాడ..
నీ పక్కనున్న దోస్త్ అంది, తొందర పడి చేరావా ఏంటి ఏదో ఒక జడ..
పడకు ఆడా... ఈడ...
నన్ను కూడా రాని నీ తొ కూడా.. కలుద్దాం ఏదన్నా దేవుని కడ.
అన్ని చినుకుల కు కలుగునా ఈ అదృష్టం....
కొన్ని ముత్యపు చిప్పలలో..
కొన్ని కొండ కొనలలో..
కొన్ని దేవాలయం లో..
కొన్ని పంట పొలములలో..
కొన్ని తిరిగి సముద్రం లో..
కొన్ని మురికి కాలువ లో..
చినుకులు తడవక తప్పదు కర్మ ఫలములలో..
అదృష్టం దాహం తీర్చిన చినుకుదా
లేక దాహం తీరిన పువ్వుదా!!!!
దైవానికే ఏరుక...
🌊
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/fbc/1/16/1f30a.png)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/f9f/1/16/26c5.png)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/f9f/1/16/26c5.png)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/f5d/1/16/26a1.png)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/f5d/1/16/26a1.png)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/f10/1/16/2614.png)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/f10/1/16/2614.png)
ఈ సుగందబరితమైన పూలలోని మకరందం మెక్కడిది?
నయనానంద కరమగు ఆ వర్ణమెక్కడిది?
వికసించెననే భావమెక్కడిది?
ఇంద్రియ బంధమై ఆస్వాదించే నా మదిలోనిదా...లేక
ఇంద్రియరహితమైన పచ్చని మొక్కదా....
వేగమే తెలుపవే మనసా.
No comments:
Post a Comment